వెంకటగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రసంగం
స్వర్ణముఖిన్యూస్ ,వేంకటగిరి :
జగనన్న సైనికుడిగా ఎంపీగా నా విజయానికి మీరే వారదులు అంటూ వైఎస్సార్ పార్టీ సైనికులందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరుననా కృతజ్ఞతలు తెలియజేసారు.
నేనూ మీలా కార్యకర్తనే, జగనన్న సైనుకుడినే కష్టపడే ప్రతి కార్యకర్త గుర్తింపబడతాడు అనేందుకు నిదర్శనం నేనే అని ఎంపీ గురుమూర్తి చెప్పారు.
మన ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయింది ఎన్నో ప్రజాకర్షక పథకాలతో మన ముఖ్యమంత్రి జనరంజక పాలన సాగిస్తున్నారు.
అమ్మఒడి, వసతి దీవెన ద్వారా విద్యా విధానం, ఆరోగ్య శ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందె విధంగా నాడు, నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్య విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చారు.
మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి అనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు రాజకీయంగా వారికి పెద్ద పీట వేస్తూ నేడు యాభై శాతం పదవులు వారికి ఇవ్వడం జరిగింది. వారి ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, చేయూత వంటి కార్యక్రమాలతో వారికి చేయూతనిస్తుందని అన్నారు. ఆలాగే అవ్వ, తాతలకి ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్ వారి ఇంటి వద్దనే అందిస్తూ వారి మొఖంలో చిరునవ్వులు చిందేలా మన ప్రభుత్వం చేస్తుందని నేను గర్వంగా చెబుతున్నాను అన్నారు. ఆలాగే సచివాలయలు ఏర్పాటు చేసి పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని ఎంపీ గారు చెప్పారు.
చేసిన మేలు మనం చెప్పుకోవడంలో విఫలమవ్వరాదు మన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మనది ఓ పెద్ద వసుదైక కుటుంబం, ఇది వైఎస్సార్ మనకి ఇచ్చిన వరం, ఈ కుటుంబంలో సభ్యుడిని, పెద్ద కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు సాధారణం మన కుటుంబంలో మనం సమస్యలని ఎలా పరిష్కరించుకొంటామో అలానే ఒకరికొకరం మాట్లాడుకొంటె సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి.
మనమందరం ఒకటిగా ఉంటే మన పార్టీ బలంగా ఉంటుంది. 2024 లో జగనన్నని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని గౌరవ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డితో సమన్వయంతో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.
ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది, గుంటూరులో జరగబోయే ప్లీనరి లో సమస్యలన్నీ అధినేత దృష్టికి తీసుకెళతాం. పార్టీ భలోపేతం చేసేందుకు కృషి చేయండి. ఈ నెల 30వ తారీకు తిరుపతి జిల్లా ప్లీనరీని జులై 8, 9 వ తారీకులలో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి ప్లీనరికి విచ్చేసి విజయవంతం చేయవలసినదిగా నాయకులకి, కార్యకర్తలకి పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment