STUAP 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి లో జెండా ఆవిష్కరణ
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
STUAP 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ ఆధ్వర్యంలో జెడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల నందు సీనియర్ నాయకులు సుధాకర్ యాదవ్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
వారు మాట్లాడుతూ.... నాటి నిజాం నిరంకుశ వైఖరిపై, తుపాకీ గొట్టాలకు ఎదురొడ్డి ఉద్యమ తిరుగుబాటు ఝండా ఎగురవేసిన కామ్రేడ్ మగ్ధుం మొహియుద్ధీన్ గారి అచంచల కార్యదీక్షా పటిమతో పోరాడినారు అని అన్నారు.
శ్రీకాళహస్తి డివిజనల్ కన్వీనర్ గుమ్మడి మురళి మాట్లాడుతూ.... కుల, మత, ప్రాంతీయ, రాజకీయ విభేదాలకు అతీతంగా ఉపాధ్యాయుల హక్కుల కోసం దిక్కులు పిక్కటిల్లే పోరాటాలు చేసిన ఘనచరిత ఒక్క రాష్ట్రోపాధ్యాయ సంఘానికే (STU) స్వంతం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో లక్షయ్య, స్టాలిన్, శ్రీహరి ,దేవేంద్ర, కృష్ణయ్య, చంద్రశేఖర్, రామచంద్రయ్య, గజేంద్ర, చిరంజీవి, రొడ్డ గోపి... మొదలైన వారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment