ఎంపీ గురుమూర్తితో తిరుపతి విమానాశ్రయ అధికారుల భేటీ
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
తిరుపతి బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీ లోని ఎంపీ కార్యాలయంలో తిరుపతి విమానాశ్రయ అధికారులు ఎంపీ గురుమూర్తితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ప్రయాణికుల రాకపోకలు పెరిగినందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక వసతులు కలిపించాలని ఎంపీ వారికి సూచించారు.
అలాగే పెద్ద విమానాలు దిగేందుగు అనువుగా రన్ వే విస్తరించేందుకు ఎదురవుతున్న భూ సమస్యల గూర్చి ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయం గూర్చి చర్చించారు. తిరుమల వేంకటేశ్వరుని దర్శనార్ధం విమాన ప్రయాణికుల సౌకర్యార్థం కరెంటు బుకింగ్ లో టిక్కెట్లు మంజూరు చేసే విధంగా శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్ధలాన్ని ఎయిర్పోర్ట్ లో త్వరితగతిన సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలని రీజినల్ డైరెక్టర్ మాధవనార్ గారితో చరవాణి ద్వారా సంభాషించడం జరిగినది. విమానాశ్రయానికి వి.ఐ.పి ల తాకిడి ఎక్కువగా ఉండటం వలన విమానాశ్రయ ముందు భాగంలో సాధారణ ప్రయాణికుల వాహనాలు పార్కింగ్ చేసుకొనేందుకు అనుకూలంగా పందిరి (కేనోపి) విస్తరింపవలసినదిగా ఎంపీ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ జనరల్ మేనేజర్ కె.ఎం.బసవరాజు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్), ఉత్తమచంద్ రాథోడ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment