శ్వేతలో దేవాదాయ శాఖ అధికారులకు శిక్షణ ప్రారంభం
స్వర్ణముఖి న్యూస్, తిరుపతి:
తిరుపతి శ్వేత భవనంలో దేవాదాయ శాఖలోని ఆర్థిక, ఐటి విభాగాల అధికారులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖలోని అధికారులకు టీటీడీ కార్యక్రమాలపై శిక్షణ నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఇందులో భాగంగా అదనపు ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ రవిప్రసాదు టీటీడీలోని వివిధ విభాగాలలో నిర్వహించే ఆర్థిక, ఇఆర్‌పి (ఎంటర్ ప్రైస్ రిసోర్స్ అప్లికేషన్) ఉపయోగాలను వివరించారు. తరువాత సిఏవో శ్రీ శేషశైలేంద్ర ఆడిట్ విధి విధానాలు తెలిపారు.
తిరుమలకు విచ్చేసే భక్తులకు అందించే దర్శనం, వసతి, ప్రసాదాలు, తదితర అంశాలపై టీటీడీ ఐటి నిపుణులు రూపొందించిన ఐటి అప్లికేషన్ల గురించి శనివారం తెలియజేస్తారు. అనంతరం అధికారుల బృందం ఆగరబత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజి ఫోటో ఫ్రేమ్‌లు, పంచగవ్య ఉత్పత్తుల తయారీని పరిశీలిస్తారు.
శిక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, జాయింట్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రామాంజనేయులు, ఐటి మేనేజర్ శ్రీ ప్రసాదరావు, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment