భాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఎన్ జి ఓ ల పాత్ర కీలకం-డిఎస్పి విశ్వనాధ్
స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రగతి సంస్థ, తిరుపతి వారి ఆద్వర్యంలో బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూపు మరియు చైల్డ్ రైట్స్ అడ్వొకసి ఫౌండేషన్, విజయవాడ వారి సహకారంతో ప్రగతి సంస్థ, తిరుపతి వారి ద్వారా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం గోడ పత్రికలను శనివారం నాడు శ్రీకాళహస్తి డి ఎస్ పి విశ్వనాధ్ గారు, ప్రగతి డైరెక్టర్ కె వి రమణ గారు విడుదల చేయడము జరిగినది. డిఎస్పి విశ్వనాధ్ మాట్లాడుతూ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వము వారు 2025 వ సంవత్సరానికి భారతదేశము భాలకార్మిక రహిత దేశముగా ఉండాలని, దీని కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరము ఉన్నదని తెలిపారు. బాల కార్మికులను గుర్తించి వారి యొక్క సమాచారాన్ని తెలియచేసినట్లైనా అటువంటి భాలకార్మికులను విముక్తి కలిగించి వారిని పనిలో పెట్టుకొన్నవారిపై చట్ట పరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. ఈ వ్యవస్థను నిర్మూలించడములో స్వచ్చంద సంస్థలు కీలకమైన భాద్యతలు తీసుకొని సంబందిత అధికారులతో సహకరించవలెనని కోరారు. ఈ నిర్మూలనలో పోలీసు సిబ్బంది సహకారము అన్నివేళలా స్వచ్చంద సంస్థలుకు అందిస్తామని తెలిపారు. ప్రగతి డైరెక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ బడిలో ఉండవలసిన పిల్లలను, ఆట పాటలతో గడపవలసిన బాల్యాన్ని బండి చేయడం అనాగరిక చర్య అని, భాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి స్థిరమైన దీర్ఘకాలిక కృషి ఎంతో అవసరం ఉన్నదని తెలిపారు. భాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమాజం లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం జూన్ 12 వ తేదీన ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుగుతోందని తెలియచేసారు. నిరక్షరాశ్యత మరియు అదనపు ఆడాయము కోసం తల్లి తండ్రులు తమ పిల్లలను పనుల్లొకి పంపిస్తున్నారు, ఎంతో మంది బాలలు వ్యవసాయ రంగములో,ఇసుక రీచ్లు, ఇటుక బట్టీలు మరియు కర్మాగారాలలో పని చేయుచున్నారని అటువంటి వారి వివరాలను తెలియచేసిన సంబందిత యాజమానుల పై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఇటువంటి యజమానులకు కనీసం 6 నెలలు జైలు శిక్ష మరియు 20 నుండి 50 వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతున్నదని తెలిపారు. ప్రగతి సంస్థ భాల కార్మిక నిర్మూలన కొరకు రేణిగుంట, ఏర్పేడు మరియు శ్రీకాళహస్తి మండలాల లోని 55 మారు మూల గ్రామాలలో కృషి చేయుచున్నదని, మా సర్వే ప్రకారం ఈ గ్రామాలలో 12 నుండి 18 సంవత్సరముల వయస్సు గల బాలలు 111 మంది బాలికలు 57 మంది వివిధ రంగాలలో బాల కార్మికులగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీరందరికి సంబందిత ప్రభుత్వ అదికారుల సమన్వయంతో విముక్తి కలిగించుటకు ప్రయత్నములు చేయుచున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే రెండు సంవత్సరాలలో ప్రగతి పని చేయుచున్న 55 గ్రామాలను బాల కార్మిక రహిత గ్రామాలుగా చేయుటకు భాల, భాలికల సంగాలు, తల్లి తండ్రుల కమిటీలు మరియు ప్రభుత్వ అదికారులను సమన్వయం చేసుకొని వారి సహకారంతో భాల కార్మిక వ్యవస్థను రూపు మాపుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది సుభాష్, ప్రభాకర్, శివా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ యానాది సంగం నాయకులు కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment