వైయస్సార్ పెన్షన్ కానుక వెరిఫికేషన్ : కమిషనర్ పుత్తూరు మున్సిపాలిటీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
వైయస్సార్ పెన్షన్ కానుక శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నందు అన్ని రకాల పెన్షన్స్ కు సంబంధించి 437 మందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయించి తిరిగి వెరిఫికేషన్ కోసం పుత్తూరు మున్సిపల్ కమిషనర్ కె వెంకట్ రామ్ రెడ్డి ఎంక్వైరీ చేసి 437 పెన్షన్లను సక్రమంగా ఉన్నాయని నిర్ధారించడం అయినది ఇందులో భాగంగా సోమవారం కాళహస్తి మున్సిపాలిటీ నందు పర్యటించి సచివాలయం సెక్రటరీ లతో కలిసి లబ్ధిదారులను విచారించి వారి నుండి వివరాలు సేకరించి సక్రమంగా ఉన్నందువల్ల అర్హులుగా గుర్తించడం అయినది , కావున ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారు సచివాలయం ద్వారా అర్జీలు సమర్పించినవారు ప్రతి ఒక్కరికి విచారించి తప్పక కరాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయబడును, ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చిన సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక మీదట కూడా అర్హులైన వారు తప్పకుండా సచివాలయం ద్వారా అర్జీలు సమర్పించిన అర్హతను బట్టి వారికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల స్కీములు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇంటింటికీ చేరవేసేందుకు సచివాలయం సెక్రటరీ వాలంటీర్లు పని చేస్తారని తెలియజేయడమైనది.. ఇట్లు. కే వెంకట్ రామి రెడ్డి కమిషనర్ పుత్తూరు మున్సిపాలిటీ
No comments:
Post a Comment