శ్రీకాళహస్తి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు కమిషనరు అధ్యక్షతన స్వయం సహాయక సంఘముల బృందములతో ప్రత్యేక సమావేశము నిర్వహించడమైనది. సదరు సమావేశము నందు మునిసిపల్ కమిషనరు
స్వర్ణముఖిన్యూస్శ్రీ ,శ్రీ కాళహస్తి :
బాలాజీ నాయక్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి సంపూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించడమైనదని, కావున ప్లాస్టిక్ ను మీ దగ్గర లోని వర్తక వ్యాపారస్తులు, పండ్ల దుకాణాలు, టిఫిన్ దుకాణములు, టీ అంగళ్ళు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు మరియు అన్ని రకములైన దుకాణముల యందు ప్లాస్టిక్ కవర్లను వాడకుండా దుకాణ యాజమానదారులకు తెలియజేసి వారిని చైతన్యపరిచి ప్లాస్టిక్ రహిత శ్రీకాళహస్తి మునిసిపాలిటీ గా రాష్ట్రములోనే ముందంజలో ఉండాలని పిలుపునివ్వడమైనది.
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద హౌసింగ్ కు సంబంధించి లబ్ధిదారులకు ఇంకనూ ఎవరికైనా పట్టాలు రాని యెడల వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని తెలియజేశారు. అర్హులైన వారు పధకం క్రింద నమోదు చేసుకొనే అవకాశము ఉందని, ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనవలసినదిగా తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన TIDCO ఇళ్లకు సంబంధించి లోన్ ల ప్రక్రియ గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించడము జరిగినది మరియు TIDCO ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యిందని తెలియజేశారు.
సదరు సమావేశము నందు మునిసిపల్ కమిషనరు శ్రీ బి. బాలాజీ నాయక్ తో పాటు రెవెన్యూ అధికారి పి.యం.వి. నారాయణ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎన్విరాన్మెంటల్) సాయి సింధు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మెప్మా సి.యం.యం. ప్రసాద్, అజీజ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పి. రవికాంత్, బి. బాల చంద్రయ్య, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment