బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత-ప్రగతి సంస్థ
స్వర్ణముఖిన్యూస్ శ్రీకాళహస్తి :
బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం .ఈశ్వరయ్య కాలనీ. ఎర్రగుడిపాడు. ఎర్రమరెడ్డి పల్లి. దొడ్ల మిట్ట. కొత్తూరు .ఎల్లంపల్లి. గ్రామాలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలతో బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా స్లొగన్స్ చేస్తూ వీధుల్లో ర్యాలీ చేయడం జరిగినది బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ మండల కో ఆర్డినేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ భాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమాజం లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం జూన్ 12 వ తేదీన ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుగుతోందని తెలియచేసారు. భాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు. ప్రతి గ్రామంలో అవగాహన కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు బాల కార్మిక రహిత గ్రామాలుగా చేయుటకు భాల, భాలికల సంగఘాలు, తల్లి తండ్రుల కమిటీలు మరియు ప్రభుత్వ అదికారులను సమన్వయం చేసుకొని వారి సహకారంతో భాల కార్మిక వ్యవస్థను రూపు మాపుటకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలలో చైతన్యం తీసుకొనిరావడానికి జూన్ 10వ తేదీ నుండి 14 వ తేదీ వరకు గ్రామాలలో పిల్లలకు భాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా .వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ గీ యించడం మరియు ర్యాలీలు, ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది గురవా రెడ్డి బాలల సంఘం పిల్లలు. గ్రామ వాలంటీర్లు ఎస్ సి వి లీడర్లు సర్పంచులు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది
No comments:
Post a Comment