భాష్యం పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ మెయిన్ రోడ్డు నందు భాష్యం స్కూల్ నందు జోనల్ ఇన్చార్జి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో యోగ దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీర సాధనకు, మానసిక వికాసానికి, ఉల్లాసానికి ఆధారం లాంటిది యోగ మరియు శరీర దృఢత్వానికి యోగా చాలా అవసరమని పిల్లలకు తెలియజేసి పిల్లలందరి చేత పాఠశాల ఆవరణములో యోగ చేయించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దివ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
No comments:
Post a Comment