శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ,సెక్యూరిటీ_ఆడిట్ నిర్వహించడం
స్వర్ణముఖిన్యూస్ ,కాణిపాకం :
శ్రీ స్వామి వారి దేవస్థానం నందు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయం నందు ఇంటలిజెన్స్ డీఎస్పీలు, ఏ,ఆర్ డి,ఎస్,పి, సిఐలు సెక్యూరిటీ_ఆడిట్ నిర్వహించడం జరిగింది, ఆలయమునందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు హోంగార్డ్స్ భద్రత విధానం ప్రవేశ గేట్లు మరియు ఆలయం నుంచి బయటకు వెళ్లి గేట్లు నందు భద్రత, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయు ప్రదేశాల మార్పు అగ్నిమాపక శాఖ వారి సూచనలు, ఎలక్ట్రికల్ వారి సూచనలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత తదితర అంశాలపై ఆలయంలో క్యూలైన్లు మరియు మాడావీదులు పలుచోట్ల సందర్శించి దేవస్థానం చైర్మన్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, DSP ISW నాగేశ్వరరావు గారు, DSP ISW సుబ్బరాజు గారు, AR DSP లక్ష్మీనారాయణ రెడ్డి గారు,
CI శ్రీనివాసులు రెడ్డి, SB SI ఈశ్వర్, ఫైర్ ఆఫీసర్ నరసింహులు రావు, ఎలక్ట్రికల్ ఏ,ఈ కిరణ్, దేవస్థానం ఈఈ వెంకటనారాయణ, ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment