అమ్మ ఆశ్రమం లో వృద్దులకు పండ్లు, చీరలు పంపిణీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బి.సి నాయకులు, చేనేత నాయకుడు కైలసాని సాయికుమార్ జన్మదినము సందర్భముగా శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్ లోని అమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు చీరలు, పండ్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లా మిత్రులు కోడూరు శివకుమార్ మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో గూడూరు నందు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పంచలు మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
పై కార్యక్రమాలలో జగదీష్, కిషోర్, మధుకుమార్, సుబ్రహ్మణ్యం, భరణి కృష్ణ, లోకానాథం, కేశవ, శివ కుమార్, జ్ఞానేంద్ర, ఆమర రాఘవ పాల్గొన్నారు.
No comments:
Post a Comment