యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ రోజు(24-06-2022) యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వున్న అనాధలకు మరియు వికలాంగులకు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ సహాయం తో భోజనం ప్యాకెట్లు,వాటర్ బాటల్స్ పంపిణీ చేయడం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్,వినోద్ లు మాట్లాడుతూ ఎంతో మంది అనాదులు,వికలాంగులు దాతల సహయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.రోడ్ సైడ్ ఉన్న అనాధులకు, వికలాంగులకు అన్నదానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.దాతల సహాయంతో అనాధులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర,వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment