MGM హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రాచగున్నేరి దగ్గర వున్న కోకా కోల బేవారేజెస్ ఆవరణలో వారి సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరం లో కోకాకోల సిబ్బంది కి MGM హాస్పిటల్ డాక్టర్ శ్రీ వివేక్ చైతన్య (గుండె వైద్య నిపుణులు ) గారి వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు ECG,షుగర్, మరియు B.P, మొదలగు పరీక్షలు చేసి అలాగే అవసరమగు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరం లో దాదాపు 150 మంది కోకా కోల సిబ్బంది పాల్గొన్నారు. పై కార్యక్రమం లో కోకా కోల బేవరిజెస్ మేనేజర్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ మా కంపెనీ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన MGM హాస్పిటల్ డైరెక్టర్ గారికి, వారి డాక్టర్స్ మరియు సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. MGM హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి చుట్టుప్రక్కల వున్న ప్రతి ఒక కార్మిక సోదరుల శ్రేయస్సు కోరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రతి కార్మికునికి ESI మరియు ఇన్సూరెన్స్ తో కూడిన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసిన కోకా కోల కంపెనీ వారిని , MGM డాక్టర్స్ ని , సిబ్బంది ని అయన అభినందించారు.
No comments:
Post a Comment