జర్నలిజం&జర్నలిస్ట్ లపై ఓ పరిశోధనాత్మక కధనం
స్టోరీ బై, ఈపూరి రాజారత్నం , ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, మంగళగిరి, 9390062078 |
జర్నలిజం అంటేనే సామాజిక స్పృహ, సామా జిక భాధ్యత, సామాజిక భద్రత.అలాగే సమస్యలపై అవగాహన,వార్త రాసే విధానంలో భాష పై పట్టు,వార్త ను చక్కగా డ్రాఫ్టింగ్ చేయగల నేర్పు కలిగి ఉన్న జర్నలిస్ట్ లు మీడియారంగంలో రాణించేందుకు ప్రధాన అర్హతలు. ఈ క్రమంలో సామాజిక స్పృహ, భాద్యత, భద్రత కల్పిస్తూ మన జర్నలిస్ట్ లు సమాజానికి సేవ చేస్తూ సమాజంలో జరిగే అవి నీతి, అక్రమాలు వెలికి తీస్తూ, సమాజంలో వివక్షకు గురవుతున్న అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్న మన జర్నలిస్ట్ ల తీరు వెల కట్టలేనిది.
ఈ క్రమంలో మన జర్నలిస్ట్ లు అందరికన్నా కొంచెం భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా భాదితులకు అవసరమైన సమయాల్లో సమాజసేవలో ఉండే వ్యక్తి కంభాల ముక్కంటి.ఈ సీనియర్ జర్నలిస్ట్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే అందరి జర్నలిస్ట్ ల లాగా బాధిత, పీడితుల తరపున కధనాలు రాసి వది వేయకుండా వారి పక్షాన నిలిచి అవసరమైతే దీక్షలు, నిరసనలు చేసి, అధికారులు, పాలకుల దృష్టికి వారి సమస్య తీసు కెళ్ళి వారికి న్యాయం జరిగే వరకు పట్టువదలని విక్ర మార్కుడు లా పోరాటం చేసి భాదితులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించే వ్యక్తి ఈ కంభాలముక్కంటి. సమస్య ఇది అని తెలిస్తే చాలు ఎటువంటి ఫలితం, స్వప్రయోజనం చూసుకో కుండా సాయపడటం ఈ సీనియర్ జర్నలిస్ట్ రక్తం లోనే సాయం అనే పదం ఇమిడి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు జర్నలిజం లో అడుగు పెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు భాదితుల కు అండగా నిలిచిన సంఘ టనలు ఎన్నో ఉన్నాయి. ఈ సీనియర్ జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ లకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు.కొంత మంది నకిలీ జర్నలిస్ట్ ల వల్ల ఆడుగంటి పోతున్న జర్నలిజం విలువలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట మిణుకు,మిణుకు మంటు న్నాయి అంటే ముక్కంటి వంటి జర్నలిస్ట్ ల ద్వారానే మనకు సమా జంలో గౌరవ,మర్యాదలు ఇంకా దక్కుతున్నాయి.ఈ సందర్భంలో మన ముక్కంటి కొందరు భాది తులు, నిరుపేదలకు అండగా నిలిచిన కొన్ని సంఘటనలు మీ ముందు కు..ఇలాంటి ఓ వ్యక్తి గురించి మన జర్నలిస్ట్ లోకం,జర్నలిస్ట్ లపై మంచి అభిప్రాయం లేని ప్రజానీకం తప్పక తెలుసు కోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.
ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రాణానికి భరోసా
ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రాణం మీదకు వచ్చింది. అతనికి లివర్ మార్పిడి చేయాలి 30 లక్షలు అవ సరం ఏర్పడింది.తప్పక డబ్బులు కావాలి. మన జర్నలిస్ట్ ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయితే నాడు అది ప్రభుత్వం మారుతున్న కాలం. అటువంటి సమయంలో మన ముక్కంటి,మరో జర్నలిస్ట్ మిత్రుడు చొరవ చూపితే అతని ప్రాణం నిలిచింది. సామాజికస్పృహ, భాద్యత వహిస్తూ ఇద్దరు జర్నలిస్ట్ లు ఒకే ఒక కథనము రాసారు..అలా ఆ కధనాని కి కొందరు స్పందించారు.. ప్రభుత్వం 15 లక్షలు ప్రక టించి బాధిత జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి అప్పటి మంత్రి పేర్ని నాని 15 లక్షల సాయం అందించడం జరి గింది.భాదిత జర్నలిస్ట్ సతీమణి తన లివర్ ను దానం చేసారు..ఒకే ఒక్క మాట,వార్త సాయం అత నికి పునర్జన్మ ప్రాప్తి చెందిం ది.అందుకే జర్నలిస్ట్ సేవల కు విలువ కట్టలేము.
రోడ్డున పడ్డ కెమెరా మెన్ కుటుంబానికి అండగా
విజయవాడ లో పదేళ్ల నుండి లోకల్ ఛానల్ లో పని చేస్తున్న కెమెరా మెన్ సురేష్ గత ఏడాది అనారోగ్యం తో మరణిం చాడు.ఆయనకు భార్య, ఏడాది వయసున్న కుమా రుడు ఉన్నారు.సొంత ఇల్లు లేదు.భార్య మల్లీశ్వరి దివ్యంగురాలు,ఆమె ఎంబీఏ చదువుకున్నా చేసేందుకు ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారం గా మారింది. మీడియా లో పనిచేసిన సురేశ్ కుటుం బానికి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందు తుందేమోనని జర్నలిస్ట్ ల ద్వారా 8 నెలలు ప్రయత్నం చేసింది.ఎలాంటి ఫలితం రాలేదు.ఇంతలోనే కరోనా లాక్ డౌన్ తో జీవనం కష్టతరమైంది.చివరి ప్రయత్నం గా ఆమె సీనియర్ జర్నలిస్ట్ కంభాల ముక్కంటికి ఆమె దీన స్థితి వివరించింది.స్పందించిన ముక్కంటి వెనువెంటనే భాదితురాలు తరపున వినతిపత్రం తయారు చేసారు.అక్కడ నుండి బాధితురాలిని నేరుగా నాటి సమాచార శాఖ మంత్రి గారి వద్దకు తీసుకెళ్లి జర్నలిస్ట్ సురేష్ మరణం తర్వాత కుటుం బం ఎదుర్కొంటున్న కష్టా లు వివరించారు.
దానికి క్షణం ఆలస్యం చేయకుండా స్పందించిన మంత్రి పేర్ని నాని లక్ష నుండి 2 లక్షలు సహాయం వచ్చేలా చేస్తానన్నారు. అంతే కాదు ఎం బి ఏ సురేష్ భార్య మల్లీశ్వరి కి కాంటాక్ట్ పద్ధతి లో ఉద్యోగం కల్పించేలా కలెక్టర్ తో మాట్లాడతానని చెప్పారు.ఇకఅంతే,సరిగ్గా నెల తిరిగేలోగా మంత్రి కార్యాలయం నుండి మల్లీశ్వరి కి ఫోన్ చేసి 2 లక్షల చెక్ వచ్చింది.మీ ఇంటికి వచ్చి ఇస్తామ న్నారు మంత్రి సిబ్బంది. చెప్పినట్లే మంత్రి కార్యా లయం నుండి వచ్చిన ప్రతినిధులు నాడు మల్లీశ్వరి కి సాయం అందచేశారు.ఇంటికొచ్చి చెక్ ఇవ్వడం తో సాయం పొంది న కెమెరా జర్నలిస్ట్ సురేష్ భార్య మంత్రి గారి కి రెండు చేతులు జోడించి కృతజ్ఞత లు తెలియజేసింది.కనీసం రెండో సారి ఫాలో అప్ చేయకుండానే మంత్రి గారు సాయం చేయడం ఎంతో గొప్పవిషయం.
ఓ ఆంగ్ల పత్రిక జర్నలిస్ట్ భార్య అనారోగ్య పరిస్థితి అర్థం చేసుకుని
విజయవాడ కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ పేరుగాంచిన ఆంగ్ల పత్రిక అతని అర్ధాంగికి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో బెడ్ పై ఉంది.ఆమె వైద్యానికి లక్షలు కావాలని డాక్టర్ చెప్పారు.వారు ఎవరిని అడగలేరు.విషయం సోషల్ మీడియా లో బాగా ట్రోల్ అయింది.షేర్లు, లైక్లు ఎన్నో వచ్చాయి.దానికి స్పందించిన ఆ మాట సహాయకారి అయిన మన ముక్కంటి ఏమి చేయాలో అదే చేసాడు. అంతే అరగంటలో 8 లక్ష ల తోడ్పాటు ప్రభుత్వం కల్పించింది.ఇదంతా ఒక పట్టుదల,సంకల్పం సాయం చేయాలనే తలంపు వల్లనే సాధ్యం అయ్యాయి.
వెన్ను విరిగిన భర్తను వీపు పై మోస్తున్న మహిళకు అండగా...
వెన్ను విరిగిన భర్తను వీపు పై మోస్తున్న మహిళకు |
ఒకే ఒక క్షణం...ఆ కుటుంబాన్ని విధి వంచిం చింది.ఆ దంపతుల అన్యోన్య దాంపత్యం కి షడన్ బ్రేక్ లు పడ్డాయి. శివ పార్వతుల్లా ఆదర్శ దంపతుల్లా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా కుప్పకూలింది.భర్త వెన్ను విరిగి కదల్లేకున్నా తన స్వార్థం చూసుకోలేదు ఆ సతి.పతి యే నాప్రత్యక్ష దైవం అంటూ వెన్నుకు దన్నుగా నిలుస్తూ మోయ లేని భారాన్ని మోస్తున్న ఓ అర్దాంగి ధీన గాధ ఇది. బంధం ముందు బరువు పెద్ద లెక్కేమి కాదంటూ ఓ మహిళ తన భర్తను వీపు పై ఎక్కించు కుని మోస్తోంది.ఇంతకీ ఎవరు ఆవిడ,అతన్ని ఎందుకు మోస్తోంది.వారికి కావా ల్సింది ఏమిటో తెలియా లంటే మీరు ఈ స్టోరి పూర్తిగా చదవాల్సిందే. భర్తను భారం అనుకో కుండా వీపు పై మోస్తున్న ఆమె పేరు కుమారి,ఆమె వీపు మీద ఎక్కింది ఆమె భర్త శివ ప్రసాద్ .వీరు విజయవాడ నగరంలో చిట్టినగర్ సమీ పంలోని కలరా హాస్పటల్ వద్ద నివసిస్తున్నారు.ఏడేళ్ల క్రితం ఎలక్ట్రికల్ షాపు లో పనిచేసే శివ ప్రసాద్, బైం డింగ్ షాపులో పనిచేసే కుమారి ల మద్య పరి చయం ప్రేమగా మారింది. వారి మనసులు కలిసాయి. కులాలు వేరై నా, ప్రేమించు కుని పెద్దల అంగీకారంతో 2012 లో దంపతుల య్యారు.వీరికి ఇద్దరు మగపిల్లలు కలిగారు. ఇరువురి సంపాదన తో హాయిగా వారి సంసార జీవితం సాగుతుంది. ఉన్నట్లుండి వీరి బంధాన్ని చూసి ఏ శక్తి కి కన్ను కుట్టిం దో ఏమో ఐదేళ్ల క్రితం ఒక రోజు చిట్టినగర్ కొండ పై ఉండే అత్తగారి ఇంటి వద్దకు వెళ్లాడు శివ ప్రసాద్. అక్కడ భవనం పై పిట్ట గోడపై కూర్చుని ఉండ గా అకస్మాత్తుగా గోడ కూలి క్రిందపడిపోయాడు శివ ప్రసాద్.ఇంకేముంది వెన్ను పూస విరిగింది.ఇక కుప్ప కూలిపోయాడు.ఇక అంతే అప్పటి నుండి జీవచ్చవం లాగా మారాడు శివప్రసాద్. ఒక్క క్షణంలో సీను మారి పోయింది.అప్పటి వరకు కుటుంబ భారం మోసిన భర్త ఎటూ కదల్లేని పరి స్థితిని చూసి తల్లడిల్లింది భార్య శివకుమారి. ఒక రోజు కాదు ఐదేళ్లుగా చంటి పిల్లవానిలాగా భర్తకు సపర చర్యలు సాగిస్తుంది. మరో వైపున వారి పిల్లల ను పోషించేందుకు అష్ట కష్టాలు పడుతోంది.ఏ రోజు కా రోజు ఎలా గడుస్తుందా అంటూ ధీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. మరో వైపున వారు తలదాచుకు నేందుకు సొంత ఇల్లు కూడా లేదు.అద్దె కు ఇల్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా అద్దెకు ఇల్లు ఇచ్చినా సకాలంలో అద్దె చెల్లించలేక చీవాట్లు చీధ రింపులు భరించాల్సి వస్తోంది.సొంత ఇల్లు కల్పించాలంటూ అడుగు పెట్టని కార్యాలయం లేదు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం.ఒక వైపున ఇద్దరు పిల్లలు మరో వైపున భర్త పరిస్థితి చూసి ఆమె పడు తున్న మానసిక వేదన అంతా,ఇంత కాదు.పగ వానికి సైతం ఇంతటి కష్టం రాకూడదు.ప్రార్ధించే పెద వుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మధర్ ధెరిస్సా స్పూర్తి తో ఇలాంటి వారికి గోరంత సాయం చేస్తే కొండంత అండగా ఉంటుంది.తమ దయనీయ పరిస్థితిని చూసి మానవత వాదు లు,దయార్ద్ర హృదయం కలిగిన వారు ఆర్దికంగా సాయం చేయాలని,ఉండ టానికి ప్రభుత్వం ఒక ఇల్లు కల్పించాలని రెండు చేతు లు జోడించి వేడుకుంటు న్నారు.సాయం చేసి అండ గా నిలవాలనుకున్న దాత లు కోసం ఎదురుచూపులు చూశారు ఆ దంపతులు.
ఈ క్రమంలో ఓ రోజు చేతిలో దరఖాస్తులు,వినతి పత్రాలు.అర్జీలు చేతపట్టిన పిర్యాదుదారుల తో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం కిటకిట లాడుతోంది.ఒక మహిళ అతని భర్తని వీపు పై మోసుకుంటూ వెళ్తోంది. ఎంతోమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు.కానీ ఎవరికీ ఆలోచన రాలేదు. ఆ దృశ్యం సామాజిక స్పృహ ఉన్న మన జర్నలిస్ట్ ముక్కంటిని కదిలించింది.వారి వివ రాలు తెలుసుకుని వారి భాధ గోడును ఆయన ఆలకించారు.ఇల్లు లేక అద్దెకట్టలేక ఇల్లు గడవక, బ్రతకలేక,ఛావలేక కాలం వెళ్లదీస్తున్నామని ఆ దంప తులు ముక్కంటి వద్ద కన్నీటి పర్యంతం అయ్యా రు.ఇక మన మనసున్న మారాజు ముక్కంటి ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా తన కెమెరా మెన్ ని పిలిచి విజువల్స్ తీయించి ఒకే ఒక కథనం టీవీలో వేశారు. అంతటి తో అతను ఆగలేదు.తన పని ముగిసింది అని ఏ మాత్రం అనుకోలేదు.కలెక్టర్, కమి షనర్,మంత్రి దృష్టికి తీసు కెళ్లారు.సొంత ఇల్లు ఇప్పిం చి దగ్గరుండి గృహ ప్రవేశం చేయించాడు మన సీని యర్ జర్నలిస్ట్ ముక్కంటి.
కుటుంబ భారం తో సతమతమవుతూ,భర్తను భుజాన మోస్తున్న ఆదర్శ అర్ధాంగి కుటుంబానికి ఎట్టకేలకు ప్రభుత్వం సొంత ఇల్లు కేటాయిం చింది.విజయవాడ,సింగ్ నగర్ లోని 77 వ బ్లాక్ లో జి ఎఫ్ 3 ఫ్లాట్ ను శివ ప్రసాద్ కు కేటాయించి మున్సిపల్ కమీషనర్ అందజేశారు.హౌసింగ్ అధికారులు దగ్గరుండి ముక్కంటి పని చేస్తున్న యాక్ట్ టీవీ సమక్షం లో చింతా శివ ప్రసాద్, కుమారి దంపతులకు ఇంటి తాళాలు అందచేసి వారిని గృహప్రవేశం చేయించారు. ఆ సమయంలో సొంత ఇల్లు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు.
పేదరాలికి ఒకే కాన్పు లో ముగ్గురు ఆడ శిశువులు, తల్లిపాల కోసం బిడ్డల ఆక్రందన
పేదరాలికి ఒకే కాన్పు లో ముగ్గురు ఆడ శిశువులు |
ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం కు చెందిన ఓ పేదింటి మహిళ ఒకే కాన్పు లో ముగ్గురు ఆడ శిశువుల కు జన్మనిచ్చింది.ఒకే కాన్పు లో ముగ్గురు శిశువులు కావడంతో తల్లి పాల కోసం ఆ శిశువులు ముగ్గురు తల్లడిల్లుతుంటే ఆ కన్నతల్లి ఆవేదన అంతా,ఇంతా కాదు. పాలకోసం పిల్లల రోదన చూసి తల్లి ఆవేదన మాటల్లో చెప్పలేనిది.ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి ఆ పేదరాలు అయిన చిన్నారి శిశువుల తల్లిని తన సొంత ఖర్చుల తో ప్రత్యేకంగా కారు ఏర్పా టు చేసి దాచేపల్లి మండ లం రామాపురం నుండి ఏకంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి రప్పిం చారు ముక్కంటి.ఆయితే ఆ తల్లి తాడేపల్లి వచ్చిన రోజుముక్కంటి కి గానీ,ఆ తల్లి కి గానీ సీఎం గారి అపాయింట్మెంట్ దొరక లేదు.దానితో ముక్కంటి ఆ తల్లి, బిడ్డల ను కారులోనే కూర్చోబెట్టి స్టోరీ ప్రిపేర్ చేసి తాను బ్యూరోగా పని చేస్తున్న ఛానల్ లో ఆరోజే స్టోరీ ప్రసారం చేసి ఆమెను తిరిగి అదే కారులో సుర క్షితంగా దాచేపల్లి పంపి వేశారు. ఇక అంతటితో తన వల్ల కాదు అని ముక్కంటి అనుకోలేదు. సమస్య ఎటువంటిది అయినా ఆయన లక్ష్యం ఒక్కటే,ఎలాగయినా భాదితులకు సాయం చేయించటమే.అందుకు తన ఛానల్ లో ప్రసారం అయిన స్టోరీని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు.అలా ఆమె సమస్య సీఎం దృష్టికి వెళ్ళింది. అంతే నాటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ కి సీ.ఎం.ఓ ఆఫీసు నుండి ఫోన్ వెళ్ళింది. అక్కడ నుండి దాచేపల్లి తాహశీల్దార్ కి ఫోన్. ఇక దాచేపల్లి రెవిన్యూ యంత్రాంగం మొత్తం దాచేపల్లి రామాపురం లో భాదితురాలు ఇంటికి ఉన్నపళంగా పరుగులు పెట్టారు. ఆమె పరిస్థితులు వాకబు చేసి పిల్లల్ని కన్న ప్పుడు అయిన ఆపరేషన్ ఖర్చులు, పిల్లల పోషణకు అవసరమైన పాల ఖర్చు లు,ఇతర ఖర్చుల మిత్తం చాలా ఎక్కువ 5 లక్షల సాయం ఆ తల్లికి ప్రభు త్వం నుండి అందింది. ఇక ఐటమ్ చూసి స్పందిం చిన పొలి టికల్ లీడర్స్, పలు సేవా సంస్థలు, ఎవరికి వారు చాలా మంది భాదితురాలి కుటుంబానికి నగదు, దుస్తులు, నిత్యా వసర వస్తువులు పలు రకాలుగా సాయం అందిం చారు.
గూడు లేని గువ్వలు,ఫ్లాట్ ఫామ్ పై నివాసం
గూడు లేని గువ్వలు,ఫ్లాట్ ఫామ్ పై నివాసం |
స్వాతంత్ర్యం వచ్చి డెబ్బైదేళ్ల అయినా నేటికి పేదరికం రూపుమారలేదు అనటానికి సజీవ సాక్ష్యం ఈ స్టోరీ. కనీస అవసర మైన కూడు,గూడు కు నోచుకోక గరీబోళ్లు దయ నీయంగా జీవనం సాగిస్తు న్నారు.ఎండా,వానా, రేయి పగలు అనే తేడాలేదు. ఆరుపదుల వయసున్న వృధ్దురాలు ముగ్గురు మనుమరాళ్లతో ఆరేళ్లుగా రోడ్డుపక్కనే పుట్ పాత్ పై జీవిస్తున్న వైనం.
అది విజయవాడ మహానగరం. సత్యనారా యణపురం లోని ఏలూరు కాల్వ వంతెన. నిత్యం రద్దీ గా ఉండే ఇక్కడ పుట్ పాత్ పై ఓ బీద కుటుంబం జీవిస్తోంది.ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఏకంగా ఆరేళ్లు ఎండకు ఎండు తూ,వానకు తడుస్తూ కనీసం ఏ పరదా చాటు లేకుండా రేయి,పగలు భేదం లేకుండా ముగ్గురు మనుమరాళ్లతో కాలం వెళ్లదీస్తుంది ఓ వృద్దు రాలు.ఆమె పేరు పీతల పార్వతి.ఈమె చిన్న కుమార్తె,అల్లుడు లు కొన్నేళ్ల క్రితం కాలం చేశా రు.దీంతో వారి సంతానం తల్లి,తండ్రి లేని అనాధ లయ్యారు.ముగ్గురు ఆడ పిల్లలకు అమ్మమ్మ పార్వతి అన్నీ తానై అతి కష్టం మీద ఆ ఆడపిల్లల్ని పోషిస్తుంది.అద్దె కట్టే స్థోమత లేక రోడ్డు పైన జీవిస్తూ కళో గంజో తాగి కాలం వెల్లదీస్తున్నారు..
వారికి ఎలాంటి అడ్రస్ లేకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు వీరికి దక్కలేదు.ఆధారం లేని అభాగ్యులకు ఆదార్ కార్డు లేకపోయింది.దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న ఆ ముగ్గురు బాలికల భవిత వ్యం ప్రశ్నార్ధకంగా మారిం ది.చదువుకోవాలని ఆశ ఉన్నా ఆబంగారుతల్లుల ఆశ నెరవేరడంలేదు. ప్రభుత్వం నవరత్నాలు ఇస్తున్నా వీరికి ఆధార్ , రేషన్ కార్డు లేకపోవడంతో అమ్మ ఒడి,బడిలో సీటు ఈ రోజు వరకు వారి దరి చేరలేదు.మరో వైపున ఆడపిల్లలకు ఏ రూపంలో ప్రమాదం పొంచి ఉందనే భయం ఆ వృద్దురాలిని వెంటాడుతూ కంటికి రెప్పలా ముగ్గురు ఆడ పిల్లల్ని కాపాడుకుం టోంది.ఏ అర్ధరాత్రి కాడ రౌడీలు,తాగు బోతులు, గంజాయి బ్యాచ్ వంటి ప్రమాద కారుల నుండి ఈ ఆడ పిల్లల్ని కాపాడుకోవ డం చాలా కష్టంగా ఉందని ఆ వృద్దురాలు బోరున విల పిస్తుంది.రాత్రి అయితే ఎవ డు ఈ ఆడపిల్లల పక్కలో దూరతారోనని నిద్రలేని రాత్రులు గడపడం తప్ప వేరే మార్గం తనకు లేదని చెమ్మ గిల్లి పోతుంది. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి వారికి ఓ గూడు కేటాయిస్తే ఆడపిల్లలను సంరక్షించుకుంటానంటుందిఅడ్రస్ ఏర్పాటు చేసి ఆధార్ ,రేషన్ కార్డు ఇస్తే వారి జీవితంలో వెలుగులు నింపవచ్చు.అయితే ఓ ప్రముఖ పత్రిక ఈ భాదితులపై ఓ కధనం రాసింది. ఆ కధనం చూసిన మన ముక్కంటి ఆడపిల్లల కు సామాజిక భద్రత కల్పించాలి అని తాను కూడా గూడు లేని గువ్వలు అంటూ మానవీయ కోణం ఉట్టిపడేలా,టీవీ వీక్షకుల అందరి మనసులు హత్తు కునేలా, అయ్యో పాపం అనేలా స్టోరీ వేయడం జరిగింది.
మీడియా కథనాలకు స్పందించిన అధికారం యంత్రాంగం ఆఘమేఘాల పై వీరి వద్ద వాలింది.అప్ప టికప్పుడు వివరాలు సేక రించి న్యాయం చేసేందుకు రంగంలోకి దిగారు.బాలి కలకు అవసరమైన వసతి, విద్యను కల్పించేందుకు చైల్డు లైన్ సాయం అందిం చేందుకు ముందుకొచ్చింది. విజయవాడ గాంధీ నగర్ చైల్డ్ లైన్ ద్వారా ముగ్గురు ఆడపిల్లలకు అధికారులు వసతి కల్పించి వారి జీవితాలకు భద్రత కల్పిం చారు. ఇక ఇల్లు లేక రోడ్డు పైన జీవిస్తున్న వైనాన్ని తెలుసుకున్న ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు మానవత్వంతో స్పందిం చారు.వారికి అన్ని విధాలు గా అండంగా ఉంటామని వృద్దురాలికి హామీ ఇవ్వడం జరిగింది.
మంచి మనసున్న 'కంభాల ముక్కంటి" 91 96762 25000 |
ఇలా మన ముక్కంటి ఎన్నో సందర్బాలలో ఎంతో మంది భాదితుల తరపున కఠినమైన హృదయాలను సైతం కదిలించి భాదితుల కు అండగా నిలిచి మన జర్నలిస్ట్ ల సామాజిక స్పృహ, సామాజిక బాధ్య తను పెంపొందిస్తూ ఆపద లో ఉన్న వారికి సామాజిక భద్రత కల్పిస్తూ తన వంతు పాత్రను పోషిస్తూ జర్నలిజం విలువలు కాపాడుతున్నారు.
స్టోరీ బై, ఈపూరి రాజారత్నం , ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, మంగళగిరి, 9390062078 |
No comments:
Post a Comment