పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం మొక్కలు నాటి భూతాపాన్ని తగ్గిద్దాం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో మొక్కల పంపిణి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళలకు అవగాహన కల్పిస్తూ రాష్ట్ర కార్యదర్శి డా. గుమ్మిడి పూడి దశరధ ఆచారి,సీనియర్ నాయకులు మందల సుబ్రహ్మణ్యం,మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని 8వ వార్డు పరిధిలో మొక్కలు పంపిణీ చేశారు.పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తూ..
ఈ కార్యక్రమం లో మందల సుబ్రహ్మణ్యం, డా. దసరధఆచారి, మిన్నల్ రవి,
చక్రాల ఉష మాట్లాడుతూ... ఉన్నది ఒక్కటే భూమి అని... సకల జీవరాసులకు... మానవాళికి ఆవాసమైన భూమి పట్ల గౌరవం, బాధ్యత కలిగి ఉండాలన్నారు. ప్రకృతిని దైవంగా భావించి గాలి, నీరు, నేల, జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కాలుష్య రహిత పచ్చని ప్రపంచం కోసం పాటు పడాలని కోరారు. పరిశుభ్రమైన, పచ్చటి జీవనశైలి పట్ల మానవుని విధానాలు, ఎంపికల్లో మార్పుల ద్వారా ప్రకృతికి అనుగుణంగా... స్ధిరంగా దృష్టి పెట్టాలని కోరారు. ప్రకృతిలో పచ్చదనం లోపిస్తే పర్యావరణ సమతుల్యత లోపిస్తుందన్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవాళి అనేక ఇబ్బందులకు గురి అవుతుందన్నారు. అందుకే పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. మొక్కలు నాటడo తో పాటు పెంచి పెద్దచేసే బాధ్యత వహించాలని కోరుకున్నారు
ఈ కార్యక్రమం లో ST సెల్ అధ్యక్షులు సుబ్బయ్య,నాయకులు ఢిల్లీ బాబు, మునిరజా యాదవ్, కయ్యురి దిలీఫ్, కొబాకు లక్ష్మణ్, విగ్నేష్,సుజిత్ సుబ్రహ్మణ్యం,మాజీ కౌన్సిలర్ అనిత, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ, చంద్రకళ,నిర్మల, సుజాతమ్మ, ఆదిలక్ష్మి, అమ్ముకుట్టి, లక్ష్మి, గౌరీ, నాగమణి, పెంచలమ్మ, ధనమ్మ,.. తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment