శ్రీకాళహస్తి స్వామి-అమ్మవార్ల దర్శనం విచ్చేసిన NAVAYUGA Group విశ్వేశ్వరావు గారు కుటుంబ సమేతంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసం, తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానమునకు స్వామి-అమ్మవార్ల దర్శనం కొరకు శ్రీకాళహస్తి దేవస్థానమునకు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా వెలసిన ఉన్న రాజగోపురమును తిరిగి నిర్మాణం చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన NAVAYUGA Group of Companies ఛైర్మన్ శ్రీ సి. విశ్వేశ్వరావు గారు కుటుంబ సమేతంగా విచ్చేసినారు. ముందుగా వారికి దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు EO K.V. సాగర్ బాబు గారు ఘనంగా ఆహ్వానం పలికి శ్రీస్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించి దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితులచే వేదమంత్రాలతో ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను కప్పి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు కేసరి సుబ్బారెడ్డి, మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment