బంగారమ్మ జాతరకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి రిషితా రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై శ్రీకాళహస్తి పట్నంలోని కైలాసరి కాలనీ నందు వేలిసి ఉన్న బంగారమ్మ ఆలయం నందు, శ్రీకాళహస్తి దేవస్థానం తరపున జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహింపబడ్డాయి, ఈ జాతరకు సంబంధించి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి మరియు ఆలయ ఈవో నాగేశ్వరరావు సారెను సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సమర్పించారు, దేవస్థానం చే అందజేసిన సారెలు ఆలయ అర్చకులు అమ్మవారిని, శక్తి స్వరూపునిగా ముస్తాబు చేసి , భక్తుల దర్శనార్థం అమ్మవారిని కొలువు తీర్చగా,,భక్తులకు శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు,
ఆలయ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ..
శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కైలాసగిరి కాలనీ నందు వెలసి ఉన్న బంగారమ్మ ఆలయం నందు నేడు జాతర వేడుకలు అత్యంత వైభవంగా శ్రీ కాళహస్తి దేవస్థానం తరపున నిర్వహింపబడ్డాయని, అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి రిషితరెడ్డి చేతుల మీదుగా అమ్మవారి సారెను ,అందజేశామన్నారు, జాతర పురష్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, మొక్కులు తీర్చుకుంటున్నారని, అమ్మవారి దర్శనార్థం వచ్చినప్పుడు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు
No comments:
Post a Comment