శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంను పరిశీలించిన (IIT తిరుపతి,IIT Chennai) ఆర్కియాలజిస్ట్ నిపుణుల బృందం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలకు విపరీతమైన లీకేజీ ఏర్పడి ఆలయమంతా నీటి మడుగుల తయారవుతుంది.ఇప్పటికే ఆలయంలో లీకేజీ నివారణకు పలు దపాలు సాంకేతిక నిపుణులు ఐఐటి నిపుణులు పరిశీలన చేశారు. తాజాగా ఎమ్మెల్యే గారు ఆదేశాలతో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు ఈవో సాగర్ బాబు గారు ఐఐటి తిరుపతి మరియు చెన్నై ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ను సంప్రదించి లీకేజీ నివారణకు సిఫార్సు చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు ఈరోజు శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి లీకేజ్ అవుతున్న ప్రాంతాలను అలాగే ఆలయం పై భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.ఎమ్మెల్యే గారు మరియు ఇంజనీరింగ్ బృందం దగ్గరుండి ఆర్కియాలజిస్టుకు ఆలయాన్ని చూపి నూతన ఉరవడిలో ఆధునికరించాలని కోరారు.
No comments:
Post a Comment