ముక్కంటిని దర్శించుకున్న గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు కుటుంబ సమేతంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కుటుంబ సమేతంగా ఆలయమునకు విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తదనంతరం దక్షణమూర్తి సన్నిధి వద్ద వారికి శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి-అమ్మ వార్ల జ్ఞాపికను మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ , అధికారులు నారాయణరెడ్డి, రవి కాంత్, ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులు పవన్ కుమార్ మరియు వైఎస్సార్ సిపి నాయకులు వెంకటరమణ నాయుడు, అంజూరు వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment