నాడు తండ్రిని కోల్పోయా.. ఇప్పుడు దేశాన్నీ కోల్పోలేను..:రాహుల్ గాంధీ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, September 7, 2022

నాడు తండ్రిని కోల్పోయా.. ఇప్పుడు దేశాన్నీ కోల్పోలేను..:రాహుల్ గాంధీ

 నాడు తండ్రిని కోల్పోయా.. ఇప్పుడు దేశాన్నీ కోల్పోలేను..:రాహుల్ గాంధీ



రాజకీయ ప్రవేశం తర్వాత.. తొలిసారి తండ్రి స్మారకం వద్దకు రాహుల్


దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటిచెప్పడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న 'భారత్‌ జోడో యాత్ర' బుధవారం ప్రారంభం కానుంది.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు.బుధవారం ఉదయం తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత ఈ స్మారకం ప్రాంగణంలో మొక్కను నాటిన రాహుల్‌.. అనంతరం రాజీవ్‌ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు డీకే శివకుమార్‌, కేఎస్‌ అళగిరి తదితరులు ఉన్నారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ ఫొటోను రాహుల్‌ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ''విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు'' అని రాహుల్‌ రాసుకొచ్చారు.దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం..బుధవారం సాయంత్రం 4.30 గంటలకు రాహుల్‌ 'భారత్‌ జోడో యాత్ర'ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రం కన్యాకుమారి చేరుకుని అక్కడి మహాత్మాగాంధీ మండపం వద్ద ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారు. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. రాహుల్‌కు జాతీయ జెండాను అందించడంతో ఈ యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం నుంచి మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3570 కిలోమీటర్లు రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. ఇది దేశ రాజకీయాల్లోనే కీలక పరిణామం అని, సరికొత్త అధ్యాయమని కాంగ్రెస్‌ ఈ సందర్భంగా ట్విటర్‌లో పేర్కొంది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad