శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు కొత్తగా డయాలసిస్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ప్రజలకు గతంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న MGM హాస్పిటల్స్ వారు కొత్తగా డయాలసిస్ (రక్తమార్పిడి) మరియు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు
కూడా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటలు హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలు, మరియు వైద్య బృందం అందుబాటులో ఉంటారని శ్రీకాళహస్తి మరియు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరని తెలిపారు.
No comments:
Post a Comment