హెల్పింగ్ హాండ్స్ సంస్థ కళాకారుడికి సైకిల్ ను వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి, నగరి వీధిలోని హెల్పింగ్ హాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈశ్వర్ అనే కళాకారుడికి సైకిల్ ను వితరణగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి చేతుల మీదగా అందించడం జరిగినది.
శ్రీకాళహస్తి లోని హెల్పింగ్ హాండ్స్ సంస్థ చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదగా కళాకారుడు కు సైకిల్ ను అందజేశారు.
గత 20 సంవత్సరములుగా సేవాభావంతో నిరుపేదలకు హెల్పింగ్ హాండ్స్ సంస్థ అనేక రకాలుగా చేస్తున్న కృషి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అంజూరు శ్రీనివాసులు కొనియాడారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో హెల్పింగ్ హేండ్స్ సంస్థ చేస్తున్న సేవలు చాలా గొప్పవని,గతంలో ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ,పేదలకు ప్రత్యేక ప్రతిభావంతులకు ,ప్రతినెల వారికి కావలసిన నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తూ తమ సేవా భావాన్ని చాటుకుంటుందని , సంస్థ అధినేత మునిర్ భాష కు మరియు సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మునీర్ భాష, సభ్యులు గరికపాటి రమేష్ బాబు, న్యాయవాది రాజేశ్వరరావు, భాస్కర్ నాయుడు, కంఠ ఉదయ్ కుమార్, మొగరాల గణేష్, కోళ్లూరు హరి నాయుడు,నరసింహా, బాల గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment