కైలాస సదన్ ప్రారంభోత్సవ పనులను పరిశీలించిన ఆలయ చైర్మన్ : అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానమునకు విచ్చేయు భక్తులకు విశ్రాంతి పొందుటకు గానూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా నిర్మించిన కైలాస సదన్ విడిది గృహమును ఈ నెల 23 తేదీన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించు తరుణాన ఆ యొక్క ప్రారంభ పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ అధికారుతో పరిశీలించడం జరిగినది.
కైలాస సదన్ విడిది గృహము ప్రారంభోత్సవ కార్యక్రమము పరిశీలనలో భాగంగా అన్నీ బ్లాక్ లోని రూములను మరియు విడిది గృహము యొక్క చుట్టుపక్కల ప్రాంతం అంతయు నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యములు గూర్చి పరిశీలించడం జరిగినది. కైలాసదన్ నందు మరింతగా లైటింగ్ సౌకర్యం కల్పించాలని, అన్ని రూములు యందు విచ్చేసిన భక్తులకు భక్తి భావం ఉట్టిపడేలా స్వామి అమ్మ వార్ల చిత్రపటాలను అమర్చవలయునని అదేవిధంగా పరిశుభ్రతను తప్పక సరిగా పాటించవలెనని, ప్రారంభోత్సవ ప్రాంతమంతా పుష్పాలంకరణ, లైటింగ్ డెకరేషన్ తదితర కార్యక్రమాలను గూర్చి పరిశీలించి ప్రారంభోత్సవ కార్యక్రమముకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు EE గంగయ్య, DE మురళీధర్, AE రాజేశ్వరి, సానిటరీ విభాగం రఘునాథ రెడ్డి, కుమార్, హార్టీ కల్చరల్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment