జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతిలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించిన ఈ వాహకనౌక.. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
No comments:
Post a Comment