పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని కోరిన విద్యార్థులు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన పర్యావరణ ఎలా కాపాడుకోవాలి, దీనిలో మన బాధ్యత ఎలాంటిదో అనే విషయాలపై పిల్లలకు నాటక రూపంలో మరియు పాటల రూపంలో చక్కగా వివరించారూ. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ షేర్లీ మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిస్టర్ షేర్లీ మాట్లాడుతూ.... పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి పౌరుడు యొక్క బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చెట్టు నాటాలని, నీటిని వృధా చేయకుండా చూసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment