కనకదుర్గమ్మ అమ్మవారి గోపురంనకి మూడు శిఖరాల వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పట్టణానికి చెందిన ప్రముఖ మెడికల్ షాప్ అరుణ మెడికల్ అధినేత తబ్జుల రాముగుప్తా మరియు కుటుంబ సభ్యులు కలసి శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధాలయమైన కనకచలం పై వెలసివున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గోపురంనకి మూడు శిఖరములు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేవస్థానంకి అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ దాతలకి వారి కుటుంబ సభ్యులకి శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత వాయులింగేశ్వరుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో పాలకమండి సభ్యులు సాధన మున్న. మరియు ఆలయ అధికారులు స్థాపతి కుమార్, దేవస్థానం అకౌంటెంట్ యుగంధర్, బాలాజి మరియు వైఎససార్సీపీకి నాయకులు కొల్లూరు హరినాయుడు. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment