శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించిన న్యాయవాదులు , పారా లీగల్ వాలంటరీలు . - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, September 3, 2022

శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించిన న్యాయవాదులు , పారా లీగల్ వాలంటరీలు .

  శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ పరిశీలించిన న్యాయవాదులు , పారా లీగల్ వాలంటరీలు .




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, బాత్ రూమ్ లు , భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు. తర్వాత ఖైదీలకు పెట్టె భోజనము వారితో బాటుతిని, భోజన సదుపాయాలు బాగున్నాయని అన్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు. వారి సమస్యలను సంబంధిత గౌరవ న్యాయమూర్తులకు తెలియజేస్తామన్నారు

న్యాయవాది రాజేశ్వర రావు మాట్లాడుతూ..... గౌరవ జిల్లా జడ్జి మరియు శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలమేరకు ఈ రోజు సబ్-జైలు ను సందర్శించడం జరిగినది, వీరికి భోజన వసతులు సంతృప్తి గానే వుంది అన్నారు.  వారికి మినరల్ వాటర్ సమయానికి అందటం లేదన్నారు . సంబంధిత  పురపాలక సంఘ అధికారులు తెలుపుతామని వెంటనే మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలని అన్నారు,  మరియు సబ్ జైల్ పరిసర ప్రాంతాలు అధిక మొత్తంలో చెట్లు మొలచిపోయాయని అవి మున్సిపల్ అధికారులు తెలిపి శుద్ధపరచాలని తెలిపారు, అలాగే తేనె పుట్ట ఉన్నదని, దానివల్ల ఖైదీలకు కొంత ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.అలాగే ఖైదీలు కొన్ని సమస్యలు తెలిపారు, వాటిని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి గారికి తెలిపి త్వరితగతిన పరిష్కరించుటకు ప్రయత్నిస్తామని అన్నారు

కార్యక్రమములో న్యాయవాదులు మల్లికార్జునయ్య,  రాజేశ్వర రావు , గరికపాటి రమేష్ బాబు, అరుణ్, పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad