రాహుల్ గాంధీ పాద యాత్ర విజయవంతం కావాలని శివయ్యకు పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
భారత దేశం భవిష్యత్తును కాపాడాలని, ప్రజల సమస్యలను కళ్ళారా చూసి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు, వాయినాడ్ ఎంపి శ్రీ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జొడో యాత్ర విజయవంతం కావాలని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.బత్తెయ్య నాయుడు సూచనతో శ్రీ ఙ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బి.విజయ శేఖర్, ఏపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి వజ్జా చేతన్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జానీ భాషా లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment