అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తిలో 13 సంవత్సరాల తరువాత శ్రీకాళహస్తిలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు క్రీడాస్ఫూర్తికి నాంది పలకడం చాలా సంతోషం : బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలోని ZP బాయ్స్ హై స్కూల్ ఈ రోజు రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల ప్రారంభోత్సవం చేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
అనంతరం బ్యాట్మెంటన్ కమిటీ సభ్యులు విచ్చేసిన క్రీడాకారులతో కలిసి మొదటగా 4 మాడ వీధులలో ర్యాలీ మీదుగా క్రీడమైదానంలోకి ప్రవేశం చేశారు.
అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ 13 సంవత్సరాల తరువాత రాష్ట్ర స్థాయి పోటీలకు మొదటగా మాకు మీకు ఎలాంటి సహాయం అయిన నేను చేస్తాను అని మాకు ముందుండి ప్రోత్సాహాన్ని ఇచ్చిన శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే ఈ విధంగా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు పెట్టాలని చెప్పిన వెంటనే నాకు చాలా ఆనందం వేసింది మీకు ఎలాంటి సహాయం అయిన సరే నేను దగ్గరుండి చేస్తాను వీలైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఎలాంటి సహాయసహకారాలు నేను మీకు అందచేస్తానని అండగా నిలిచిన MLA మా కమిటీ సభ్యులు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము..
అనంతరం MLA మాట్లాడుతూ శ్రీకాళహస్తి వేదిక అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడకి విచ్చేసిన 13 జిల్లాల క్రీడాకారులు, చిన్నారులకు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే వీరికి సహకారం అందించిన రాష్ట్రా స్పోర్ట్స్ అథారిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఎలాంటి సహాయం కావాలన్న నేను ఉన్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 13 జిల్లాల క్రీడాకారులు, కమిటీ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు
No comments:
Post a Comment