శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మాశ్రమంలో యోగా సర్టిఫికెట్ల పంపిణీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి సుఖ బ్రహ్మాశ్రమం వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం యోగా సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సుఖ బ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆశ్రమ ఆధ్వర్యంలో 1679 మంది యోగా శిక్షణ పొందారు. ప్ యోగా శిక్షణ పొందిన వారికి యోగ శిక్షణ సర్టిఫికెట్లను ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి, మఠాధిపతులు సస్వరూపానందగిరి
విష్ణు సేవానందగిరి తదితర స్వామీజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామీ మాట్లాడుతూ పూర్వ కాలం నుంచి యోగ విద్యతో మహర్షులు రుషులు చిత్తమును ఎలా కట్టడి చేసి ఆరాధనపై మనసు లగ్నం చేసేవారు వివరించారు. భారత లోని పురాతన యోగ విద్య విశిష్టతను ఐక్యరాజ్యసమితిలో అన్ని దేశాలు ఆమోదించే విధంగా కృషి జరిగిందని వివరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగ ఆసనాలు ఆచరించి సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు. యోగ మాస్టర్ మార్కండేయులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉచిత యోగా శిక్షణ ఇస్తూ యోగాసనాలు ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు అన్నారు . యోగా శిక్షణ పొందిన శిక్షకుడు మోహన్ మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం తద్వారా ఎంతోమంది యోగ నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారన్నారు.
"సుఖ బ్రహ్మాశ్రమం" కాదు స్వర్ణముఖీ అది "శుకబ్రహ్మాశ్రమం". శుకుడు అనే మహర్షిపేరున ఏర్పడిన ఆశ్రమం. ఏమీ తెలియని సజ్జు ఏలుబడిలో ఉందా తెలుగు పత్రికారచనారంగం! హతవిధీ!!
ReplyDelete