ముక్కంటిని దర్శించుకున్న ప్రముఖ సీనియర్ నటులు తనికెళ్ళ భరణి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాహు-కేతు సర్పదోష నివారణల ప్రముఖ క్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై తెలుగు,తమిళ, హిందీ సినీ రంగ చలన చిత్రాలలో నటించిన ప్రముఖ సీనియర్ నటులు, నంది అవార్డుల గ్రహీత, కథా రచయిత, కవి మరియు గొప్ప శివ భక్తుడైన తనికెళ్ళ భరణి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవస్థానమునకు విచ్చేశారు. వారికి ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు సాదరంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాకార్యక్రమాలతో దర్శనాన్ని చేయించారు.
దర్శనానంతరం ఆలయంలోని శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగరబాబు గార్లు తనికెళ్ల భరణి గారికి ఆలయ వేద పండితులచే మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదాలు అందజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కృష్ణారెడ్డి, మల్లికార్జున ప్రసాద్, వేద పండితులు శివప్రసాద్ శర్మ స్వామి, శ్రీనివాస శర్మ స్వామి, రాకేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment