పరిసరాలు శుభ్రముగా ఉంటేనే ఆరోగ్యం, విద్య అందుతుందని తెలిపిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జిల్లా కోర్టు మరియు శ్రీకాళహస్తి చైర్మన్-సీనియర్ సివిల్ జడ్జి వారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ధర్మరాజుల స్వామి గుడి ఎదురుగా ఉన్న మహిళ హాస్టల్ లోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వసతులపై హాస్టల్ విద్యార్థులను ఆడిగి తేలుసుకొనారు. విద్యార్థులకు చట్టల పై అవగాహన కల్పించారు.
న్యాయవాదులు మాట్లాడుతూ... గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారి అదేశాలమేరకు ఈరోజు హాస్టల్ పరిశీలించడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏదైనా ఉంటే జడ్జి గారికి తెలిపి తర్వాతగతిన పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు
విద్యార్థుల హాస్టల్ భోజన వసతులు బాగుందని అన్నారు.విద్యార్థుల కు ఏదైనా సమస్యవుంటే 100 ఫోన్ నెంబర్ గాని లేదా 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, ప్రజ్ఞ శ్రీ, అరుణ్ ..మొదలినవాలు , కోర్ట్ లీగల్ సర్వీసెస్ సిబ్బంది , పారా లీగల్ వాలంటరీ పాల్గొన్నారు,
No comments:
Post a Comment