జెట్టిపాలెం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ముత్యాలమ్మ గుడి వీధిలోని జెట్టిపాలెం నందు వినాయక స్వామి వారి నిమజ్జన ఉత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు . వారికి మాజీ కౌన్సిలర్ కంటా ఉదయ్ కుమార్ ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. తదుపరి వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, రాణి ప్రసన్న, అనురాధ, కౌసల్య, దొరమ్మ, లక్ష్మీ వాణి, మరియు స్థానికులు అత్యధికంగా పాల్గొన్నారు.
No comments:
Post a Comment