జ్ఞానబోధ వినాయకుడిని దర్శించుకున్న అదనపు జిల్లా జడ్జి శ్రీమతి అర్చన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నవభారత్ యువజన సంఘం వారి ఏర్పాటుచేసిన జ్ఞానబోధ వినాయక స్వామిని గతంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం గుంటూరు జిల్లా అదనపు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి అర్చన కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. మానవ సంబంధాలను చాటి చెప్పే జ్ఞానబోధ గణపతి చాలా బాగుందని ఏర్పాటుచేసిన నవభారత్ యువజన సంఘం వారిని అభినందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గరికపాటి రమేష్ బాబు, గుమ్మళ్ళ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment