స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఐరాల, కాణిపాకం నందు వెలసియున్న స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము బ్రహ్మోత్సవముల సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అర్చకులతో కలిసి పట్టు వస్త్రాలు, ఫల,పుష్ప, పూజా సామిగ్రిని సమర్పించడం జరిగినది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్లిన బృందాన్ని కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు గార్ల సారధ్యంలో ఆలయ అధికారులు ఘనంగా స్వాగతించారు. అనంతరం పట్టువస్త్రాలను వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పించడం జరిగినది. తదనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపం వద్ద మక్కంటి ఆలయ చైర్మన్, ఇ. ఓ., పాలక మండలి సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను శాలువాళ్లతో సన్మానించి స్వామి వారి జ్ఞాపికను మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ మరియు కార్యనిర్వాహణ అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, జ్ఞాపికలను తీర్థ ప్రసాదాలను కాణిపాకం దేవస్థానం చైర్మన్, కార్య నిర్వహణ అధికారి మరియు ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం AEO. కృష్ణా రెడ్డి, PRO పురుషోత్తం,..... అర్చకులు అర్ధగిరి స్వామి........ధర్మకర్తల మండలి సభ్యులు మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్, కొండూరు సునీత, రమాప్రభ, ప్రత్యేక ఆహ్వానితులు జూలుగంటి సుబ్బారావు, చింతామణి పాండు, పవన్ కుమార్, mp లక్ష్మీ మరియు భాస్కర్ నాయుడు, న్యాయవాది లక్ష్మీపతి, సుబ్బారాయుడు, మాజీ సభ్యులు పీఎం చంద్ర నరసింహులు, బాల గౌడ్, తేజు, సునీల్, తేజ మరియు కాణిపాక ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment