దసరా నవరాత్రులు ప్రారంభం - శాస్త్రయుక్తంగా కలశ ప్రతిష్ట
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధం ఆలయం అయిన కనకాచలం కొండపై వెలసి ఉన్న శ్రీ కనక దుర్గాంబ అమ్మవారి దేవి నవరాత్రుల మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు సునీత, లక్ష్మీ, ప్రత్యేక ఆహ్వానితులు MP లక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజులో భాగంగా ఆలయంలోని కలశాన్ని ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం శక్తి నామస్మరణాలతో కలిశాన్ని ఆలయ వేద పండితుల మంత్రోచ్చనలతో ఆలయ ప్రాకారం చూట్టూ ప్రదక్షణలు చేశారు. అదే విధంగా నవరాత్రి ఉత్సవాలు యందు ఎటువంటి ఆటంకాలు లేకుండా అష్ట బంధనం పూజా కార్యక్రమం శాస్త్ర యుక్తంగా విశేషంగా నిర్వహించారు. అనంతరం మూలవిరాట్ కనకదుర్గ అమ్మవారికి పలురకాల సుగంధ ద్రవ్యాలు చందనం పసుపు, పంచామృత, నారికేల జలాలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దేవి నవరాత్రి ఉత్సవాలు సర్వం సిద్ధం చేసిన తరుణంలో నవరాత్రుల మొదటి రోజులో భాగంగా అమ్మవారికి కలిస స్థాపన కార్యక్రమం మహాద్భుతంగా నిర్వహించారని, కనకాచలం పై వెలసి ఉన్న అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తులకు ఎటువంటి ఆటలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసున్నామని, భక్తులు కొండపైకి ఎక్కు మెట్లుకు కూడా కూల్ పెయింట్ వేసి తీవ్రమైన ఎండలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సౌకర్యం కల్పించామని, అదేవిధంగా అమ్మవారి మాల ధరించిన మహిళా భక్తులందరికీ శీఘ్రంగా ప్రత్యేక దర్శనం జరిగేలాగా అధికారులకు సూచనలు ఇచ్చామని, కొండపైకి ఎక్కలేని భక్తులకు ఇదివరకు ఎస్వీఆర్ సైకిల్ షాపు వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహమునకు ఎండకి వానికి ఆటంకాలు పడుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించే వారిని, కానీ ఇప్పుడు అమ్మవారి ఉత్సవ మూర్తిని కృష్ణారెడ్డి మండపం నందు కొలువు తీరుస్తున్నామని అక్కడే మహిళలందరూ ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపారాధనలు పూజా కార్యక్రమంలో నిర్వహించుకోవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా నవరాత్రుల్లో ప్రత్యేకతను చాటుకున్న శ్రీకాళహస్తి నవరాత్రులలో భాగంగా మొదట కనకాచాలంపై వెలిసిన అమ్మవారికి కలిస స్థాపన పూజా కార్యక్రమం నిర్వహించి తదుపరి సాయంత్రం దేవస్థానంలోని అమ్మవారి గర్భాలయం నందు కలిస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించునట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజులు పాటు మహాద్భుతంగా నిర్వహించే దుర్గాంబ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మల్లిఖార్జునప్రసాద్, లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, పూజారులు శ్రీనివాస్ శర్మ, శ్రీనాధ్ శర్మ, గోవింద్ స్వామి, చంగలరాయులు స్వామి మరియు, MP సుబ్బారాయుడు, బాల గౌడ్, ప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.
No comments:
Post a Comment