వాయులింగేశ్వర సేవలో (SBI) చైర్మన్ దినేష్ కారా దంపతులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, September 26, 2022

వాయులింగేశ్వర సేవలో (SBI) చైర్మన్ దినేష్ కారా దంపతులు

వాయులింగేశ్వర సేవలో (SBI) చైర్మన్ దినేష్ కారా దంపతులు 




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి క్షేత్రమునకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ దినేష్ కారా దంపతులు  విచ్చేశారు. వారికి  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  దక్షిణ గోపురం వద్ద ఆలయ అర్చకులతో వేదమాంత్రాలతో, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. స్వామి-అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి  శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని  మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తదనంతరం స్టేట్ బ్యాంక్  చైర్మన్ దినేష్ కారా గారికి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు శ్రీకాళహస్తి దేవస్థానమునకు విచ్చేసిన భక్తులు ఆలయ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో భక్తులు వీక్షించుటకు వేలింగాలకోన లోబావి, దుర్గమ్మ కొండ, కుమార్ స్వామి తిప్ప, ధర్మరాజుల గుడి, కాళికామాత గుడి లాంటి అనుబంధాలయాలు ఇంకా దాదాపు 15 దేవాలయాలదాకా ఉన్నాయని వీటన్నిటిని భక్తులు వీక్షించేందుకు వీలుగా దేవస్థానం భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కలిగి ఉన్నదని, కానీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు రోజురోజుకు భక్తుల తాకిడి  విపరీతంగా పెరుగుతుండటంతో ఒక బస్సు సరిపోవటం లేదని, కావున తమరు సహృదయంతో 35 సీట్లు సామర్థ్యం కలిగిన బస్సును వీలైనంత త్వరగతిన అందజేయాలని కోరి వినత పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై స్టేట్ బ్యాంక్ చైర్మన్ సానుకూలంగా స్పందించి, తొందరలోనే ఈ విషయమై తెలియజేసి తప్పక బస్సును అందజేస్తామని చైర్మన్ అంజూర్ శ్రీనివాసులుకి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ CGN నవీన్జా దంపతులు, DGM వరదరాజన్ దంపతులు, RM అరుణ్ కుమార్, పట్టణ బ్యాంకు మేనేజర్ స్వప్న ప్రియ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad