శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో " ఇంటర్వ్యూ నైపుణ్యాల" పై ఉపన్యాసం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీ నందు గల ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి రాజశేఖర్ గారి అధ్యక్షతన ఆంగ్ల విభాగాధ్యాపకులు శ్రీ మతి మాలతీ గాబ్రియేల్ మరియు శ్రీమతి డాక్టర్ యమ్ రేవతి గార్ల ఆధ్వర్యంలో ,శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇంగ్లీషు విభాగం తో వున్న "మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్" ప్రకారం ఈరోజు పద్మావతి మహిళా కళాశాల ఆంగ్ల విభాగాధిపతి శ్రీమతి నీరజ గారు శ్రీ కాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలకి విచ్చేసి "ఇంటర్వ్యూ నైపుణ్యాల" పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ద్వితీయ సంవత్సర విద్యార్థులను ఉద్దేశించి "ఉపన్యాసం ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షల కోసం ఆంగ్ల పదజాలంతో సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ టి మాలతి గాబ్రియల్ మరియు డాక్టర్ యమ్ రేవతి గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment