నేటి నుండి శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, September 6, 2022

నేటి నుండి శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాలు

నేటి నుండి  శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాలు






స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.  శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూ రు తారక శ్రీనివాసులు సారథ్యంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను నివారించి, మూలవిరాట్లకు పునర్తేజం తెచ్చే విధంగా పూజలను చేపట్టారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో దక్షిణామూర్తి వద్ద శ్రీ(saalipurugu)కాళ(pamu)హస్తి(ఏనుగు ) ఉత్సవర్లు మరియు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తి ని కొలువు తీర్చి విశేష అభిషేక పూజలు చేపట్టారు. 

ఉత్సవర్లుకు వివిధ రకాల పూజ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి, విశిష్ట అలంకారాలు చేశారు. ధూప దీప నైవేద్యాలు నివేదించి, పూర్ణ హారతులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా  తమ పాలకమండలి సారధ్యంలో ఆలయంలో మూలవిరాట్లకు శక్తి పునర్తేజం వచ్చే విధంగా పవిత్ర ఉత్సవాలు వైభవంగా చేపట్టామన్నారు.  పూజా విధానాల్లోను, ఇతర ఇతర జరిగిన దోషాలన్నిటిని నివారించి, మూలవిరాట్లకు నూతన తేజస్సు తీసుకురావడం వల్ల ఈ ప్రాంతాలని సస్య శ్యామలంగా ఉండెలా,  దర్శించుకున్న భక్తులకు దేవత మూర్తి ల  ఆశీస్సులు లభించి ప్రతి ఒక్కరూ  సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా దేవదేవుని ఆశీస్సులు లభించాలని, దోషాలన్నీ హరించాలని పూజా  కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాధన్ గురుకుల్, అర్ధగిరి స్వామి, కరుణాకర్ స్వామి, శ్రీనువాస గురుకుల్ స్వామి, తేజ స్వామి, గోవింద్ స్వామి ఆలయ ఎ.ఇ.ఓ. కృష్ణారెడ్డి, ఏ.సీ.మల్లికార్జున్ ప్రసాద్, ఆలయ సూపరిండెంట్ అయ్యన్న, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఆలయ   ధర్మకర్తల మండలి సభ్యులు పసల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ,లక్ష్మీ, సుబ్బారెడ్డి, సాధన మున్నా, జయశ్యామ్, ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పాండు, ఎంపీ లక్ష్మీ, నీలా మరియు స్థానిక నాయకులు పాలమంగళం రవి, సెన్నేరు కుప్పం శేఖర్, సుబ్బారాయుడు, బాల గౌడ్ , తేజ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad