అమిత్ షా పర్యటనపై సీపీఎం నిరసన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలనీ, ఆయన్ను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి, నాయకులు పెనగడం గురవయ్య, వెంకటేష్, రాధమ్మ, రాపూరు సుబ్రమణ్యం, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment