పిల్లలను మానసికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా : K.V. రమణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రగతి సంస్థ ఆధ్వర్యo లో ఎల్లంపల్లి ఎస్టీ కాలనీ మరియు B.V.పురం గ్రామాలలో బాలల నిపుణుల చే రూపొందించిన చైల్డ్ కలెక్టివ్ మాడ్యూల్స్ ను గ్రామ బాలల సంఘాల పిల్లలచే ప్రాక్టీస్ చేయించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రగతి సంస్థ శ్రీకాళహస్తి మండల కో ఆర్డినేటర్ రామచంద్ర మాట్లాడుతూ భావోద్వేగాలు మరియు స్వీయ గుర్తింపు అనే రెండు మాడ్యూల్స్ ను చేయించడం జరిగింది. పిల్లలను మానసికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మాడ్యూల్స్ ను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. సందర్భాన్ని బట్టి ఎలా స్పందించాలి, తనలోని బలాలని ఏ విధంగా గుర్తించి ముందుకు సాగాలి అనే విషయంగా ఈ మాడ్యూల్స్ ను జాతీయ స్థాయిలో నిపుణులు రూపొందించడం జరిగిందని తెలిపారు. పిల్లల చదువు అభివృద్ధివిషయంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ K.V. రమణ తీసుకునే చొరవ చాలా గొప్పదని ఈ సందర్భoగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది శివారెడ్డి పిల్లలు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
No comments:
Post a Comment