గురువును సన్మానించిన కామర్స్ అకాడమీ పూర్వ శ్రీకాళహస్తి విద్యార్థులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువర్యులైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గురువర్యులైన అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదేనన్నారు విద్యార్థుల్లో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగును పంచేవాడే గురువు క్షేత్రం అయితే శిష్యుడు విత్తు లాంటివాడు రెండింటి మేలు కలయిక వల్ల జ్ఞానం అనే బంగారం పంట పండుతుంది ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పి ఊహలకు రెక్కల నుంచి అద్భుత ప్రపంచంలో వివరించే శక్తినిస్తాడు విద్యార్థులతో ఒక స్నేహితుడిగా ఒక వేదాంతిగా మార్గదర్శకుడుగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి ఎదుగుదలకు ఉపయోగపడతారు ఎందరో ఉత్తమ విద్యార్థులను విద్యార్థులు తయారు చేశారన్నారు అనంతరం తనను సన్మానించిన శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు జక్కాల బాలకృష్ణ గౌడ్ ను అభినందించి తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటాయని ఆశీర్వదించారు
No comments:
Post a Comment