కృష్ణంరాజుకు ఘన నివాళి : అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి బోయ వంశస్థులు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటులు మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజుకు ఘన నివాళులు అర్పించారు. తేరు వీధిలో గాంధీ విగ్రహం వద్ద
ఏర్పాటుచేసిన కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విచ్చేసి స్వర్గీయ కృష్ణంరాజు పవిత్రకు ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో మొట్టమొదట పూజ భక్తకన్నప్పకే బోయ వంశస్థులు అధ్యక్షులు ధన వారి మిత్రబృందం భక్త కన్నప్ప చిత్రం నిర్మించిన మహానటుడు కృష్ణంరాజు మరణించినాడు అని వారు బాధపడి కాళహస్తి క్షేత్రం కృష్ణంరాజు భక్త కన్నప్ప పాత్రలో అద్భుతంగా నటించారు భక్తకన్నప్ప చరిత్రని యావత్తు ప్రపంచానికి తెలియచేశారాని బోయవంశంస కులస్తులు ఈ రోజు మహానటుడు కృష్ణంరాజు నివాళులర్పించారు కృష్ణంరాజు పవిత్ర ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత వాయులింగేశ్వరుని స్వామి -అమ్మవార్ల ఆత్మ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ఈ కార్యక్రమంలో బోయ సంఘం అధ్యక్షులు ధన, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, పవన్ కుమార్, మధు, తేజ తదితరలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment