చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, July 13, 2023

చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

 చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం  షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


సూళ్లూరుపేట చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది..

ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad