శ్రీ విజయ గణపతి స్వామివారి నిమర్జనం : ఎన్టీఆర్ నగర్ శ్రీకాళహస్తి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ నందు వెలసిఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంనందు చవితివేడుకలు అంగరంగ వైభవంగా 5రోజులు పాటు నిర్వహించారు. 5వరోజున స్వామివారి నిమర్జనం కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించి ,ఊరేగింపుగా స్వామివారిని స్వామి వారిని తీసుకువెళ్లి పట్టణ శివారులోని తంగెళ్లపాలెంలోని తెలుగంగకాలువ నందు గణనాథుని నిమజ్జోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాధుని గంగాఓడిలో నిమజ్జనం కావించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ...వినాయక చవితి ఉత్సవాలంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగని, ఈ నేపథ్యంలో తమ వీధి నందు చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుని, నేడు శాస్త్రోత్తంగా పూజాది కార్యక్రమాలునిర్వహించి గణనాధుని గంగకాలువ నందు నిమజ్జనోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నాథముని, గురవయ్య, శివ ,చిన్న, శేఖర్ ,నాని ,జై చంద్ర, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment