శ్రీశ్రీశ్రీ విజయ గణపతి ఆలయం అన్నదాన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక చవితి పండుగ ఉత్సవాల కార్యక్రమాలలో భాగంగా స్థానిక భాస్కర్ పేటలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ విజయ గణపతి ఆలయం నందు నిర్వహించిన అన్నదాన కార్యక్రమమునకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారిని వినాయక స్వామి ఆలయం వద్దకు ఆలయ కమిటీ నిర్వాహకులైన పులి రామచంద్ర, పులి రాధాకృష్ణ, బండారు రవి, జగదీష్, పులి హేమా, పులి రమేష్, పులిరాజా పేర్నేటి, మోహన్ కృష్ణ, పులిహరి, పులి శీను, కట్ట సుధాకర్, చల్ల చంద్రశేఖర్, మాచర్ల బత్తయ్య, ఈశ్వరయ్య, కన్నా సురేష్, మునిరాజా తదితరులు చైర్మన్ గారిని ఘనంగా ఆహ్వానించి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికలంకరించిన శేష వస్త్రాలతో సత్కరించి సన్మానించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమమును చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారి చేతులమీదుగా ప్రారంభించి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాలను పంచిపెట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి మహోత్సవాలలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే భక్తులందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ విజయాలు చేకూరాలని, అదేవిధంగా గత 11 సంవత్సరములుగా వినాయక చవితి పర్వదినాలలో అన్నదానం నిర్వహిస్తున్నటువంటిభాస్కరపేట శ్రీ విజయ గణపతి కమిటీ నిర్వాహకులు అందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని యొక్క చల్లని దీవెనలు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కంఠ ఉదయ్ కుమార్, బీసీ పట్టణ అధ్యక్షుడు బాలా గౌడ్, కాంట్రాక్టర్ తేజు, సునీల్, తేజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment