అంబరాన్ని అంటిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (మట్టి గణపతి) వారి నిమర్జన సంబరం...
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నిన్నటి రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయకచవితి ఉత్సవాలు -2022లో భాగంగా శ్రీ వరసిద్ధివినాయక స్వామి (మట్టి గణపతి) వారి నిమజ్జన మహోత్సవము బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ కోలా ఆనంద్ గారు మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అశేష జనసందోహం మధ్య, మేళతాళలతో నాలుగు మాడ వీధుల్లో గణనాథుని ఊరేగింపు మహోత్సవము అనంతరం స్వామి వారి నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమం నందు పాల్గొన్న భక్తులందరికీ కూడా కమిటీ సభ్యులు వారు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయకస్వామి కమిటీ సభ్యుల తరపున శ్రీ కోలా ఆనంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
No comments:
Post a Comment