గోశాలను తనిఖీ చేసిన : అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తనిఖీ చేశారు. గోశాలకు అవసరమైన సిబ్బందిని పెంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నీ గోశాలలో ఆవు మృతి చెందడంతో సమాచారం అందుకున్న చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గోశాలకు వెళ్లి పరిశీలన చేశారు. గోశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరతతో గోవుల సంరక్షణ కష్టమవుతుందని తెలుసుకున్న చైర్మన్ అందుకు తగ్గ చర్యలు చేపట్టే విధంగా దేవస్థానం అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా చైర్మన్ గోవులకు ఎలాంటి ఇబ్బందులేని విధంగా చర్యలు చేపడుతున్నామని, గతంలో గోశాలకు దేవాలయ శాఖ, కమిషనర్ ఉత్తర్వులు ప్రకారం 20 గోవులకు ఒక సిబ్బంది ప్రకారం 20 మందిని మాత్రమే నియమించుకున్నారని, కానీ ప్రస్తుతం దాదాపు 832 గోవులు కలిగి ఉన్న గోశాలకు 40 గోవులకు ఒక సిబ్బందిగా వాటిని పరిరక్షించుటకు కష్టతరమవుతుందని గమనించి సిబ్బందిని త్వరితంగా నిర్మించే విధంగా ఉత్తర్వులను, అవసరమైన సిబ్బందిని కూడా నియమించే విధంగా దేవాదాయ శాఖ నుంచి అనుమతి కోసం ప్రతిపాదన చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఈ తనిఖీలు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మున్నా, గోశాల ఇన్చార్జ్ రాజశేఖర్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment