ముక్కంటి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహా పుణ్యక్షేత్రం, దక్షిణ కైలాసం, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాలయ అమావాస్య సందర్భంగా చెన్నై వాస్తవ్యులైన గజలక్ష్మి బాలయ్య వితరణతో బేరిశెట్టి సంఘం వారు ఆలయమునకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమమును ప్రారంభించినారు. ఆదివారం, మహాలయ అమావాస్య కావటం చేత భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment