నోరుఅదుపు మాటపొదుపు అంటూ : చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, September 6, 2022

నోరుఅదుపు మాటపొదుపు అంటూ : చక్రాల ఉష

నోరుఅదుపు మాటపొదుపు అంటూ : చక్రాల ఉష


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


జగన్ మెప్పుకోసం సృహలో లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించం ఖబడ్దాల్ ..పోతుల సునీత, ఉషశ్రీ చరణ్, కళ్యాణి, అమ్మాజీ వ్యాఖ్యలపై చక్రాల ఉష ద్వాజమెత్తారు .!

నోరుఅదుపు మాటపొదుపు అంటూ ..!

అనవసరమైన విషయాల మీద పెట్టె శ్రద్ధ రాష్ట్రంలో అమాయక ఆడబిడ్డలు రోజూ రోజుకు కిరాతకంగా అత్యాచారాలు హత్యలు చేయబడుతుంటే వేడుక చూడడం మాని కాపాడే ప్రయత్నం చేయాలని ఆగంతుకులను వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలనన్నారు

ఆడబిడ్డలు రాత్రే కాదు పగలు కూడా రోడ్లో నడిచే భాగ్యంకొరవడిందని ఆఖరికి ఇళ్లల్లో ఉంటే కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు 

విచ్చలవిడిగా కామాంధులు రోజూ రోజుకు రెచ్చిపోతున్నారని నిన్న నెల్లూరు జిల్లా లో 9వతరగతి చదివే ఆడబిడ్డ ఇంట్లో ఉంటే కూడా బలవంతం చేసి యాసీడ్ పోసి గొంతు కోశారంటే మీ పాలనలో చట్టాలు చుట్టాలుగా మారలేదా అని ప్రశ్నించారు 

    జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం సృహలో లేకుండా నోటికి వచ్చినట్టు తప్పుడు కూతలు కూస్తూ ఉంటే తెలుగుమహిళలు చూస్తూ ఊరుకోబోమని పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హితవు పలికారు

 పోతుల సునీత గతం మరిచి జగన్ కల్తీ మద్యం తాగినట్లు ఇష్టానుసారంగా నారా కుటుంబంలోని రాజకీయాల్లో లేని మహిళలపై, పవన్ కళ్యాణ్ మీద ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై కౌంటర్ ఇచ్చారు. ఈ నలుగురు వైసీపీ మహిళా నాయకురాళ్లు  బూతుల మంత్రిని, గన్నవరం గజ్జికుక్కని, అరగంట అవంతిని, ఆంబోతు రాంబాబు ని ప్రపంచానికి విశ్వరూపం చూపించిన గోరంట్ల మాధవ్ ని మించిపోయి పోటీ పడి మరి మాట్లాడుతున్నారని 

 మహిళలై యుండి మహిళలపై నోరు పారేసుకుంటున్నారు మీరు మహిళలేనా బహుశా మీరు సృహలో ఉన్నట్టు లేవని విమర్శించారు.

రాజకీయానికి సంబంధం లేని  మహిళలను బయటకు తీసుకువచ్చి రాజకీయం చేయటం ఆమె దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గార్లను ఎదుర్కొనే   ధమ్ము సత్తా లేని వైసీపీ నాయకులు నీలాంటి  దిగజారుడు రాజకీయాలు చేసివారితో మాట్లాడించటం వైకాపా పార్టీ యొక్క నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. బరితెగించి తప్పుడుకూతలుమీరుకూస్తేచూస్తూ మేము కూడా ఊరుకోం మేము కూడా బరితెగిస్తే మీకన్నా ఎక్కువనే మాట్లాడగలమన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు రాజకీయ బిక్షపెడితే ఆ నాయకుడినే నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదని మండిపడ్డారు. నారా కాదు సారా అని మాట్లాడటం సరికాదని సునీతను హెచ్చరిస్తూ.. ఎవరు జే బ్రాండ్లతో రాష్ట్రాన్ని కల్తీ మద్యంతో ఏరులై పారిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ2 విజయ్ సాయి రెడ్డి ఏ విధంగా అయితే వారి యొక్క బంధువులుతో కంపెనీలు పెట్టించి అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేయించి కోట్లు గడిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై ఆరోపణలు చేస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని , భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాలకు సహాయసహకారాలు అందిస్తున్నారని,,బ్రాహ్మణి పారిశ్రామిక రంగంలో విజయవంతంగా దూసుకుపోతూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలను బ్రతుకు తెరువు చూపెడుతూ  ఉంటే వారి మీదా నీ తప్పుడు ఆరోపణలు అంటూ మండిపడుతూ 

ప్రభుత్వంలో ఉన్నావు కదా అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలుగు మహిళలంతా కూడా ఏకమై తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad